సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,42,875కి చేరింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 338 కేసులు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 119, వరంగల్ అర్బన్ జిల్లాలో 71, పెద్దపల్లి జిల్లాలో 66, ఖమ్మం జిల్లాలో 65, సిద్దిపేట జిల్లాలో 64 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.