సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. తాజాగా 10 మంది కరోనా వ్యాధిబారినపడి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో 18,547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో 1088 మంది డిశ్చార్జ్అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధితో అత్యధికంగా 517 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 32, జోగుళాంబ గద్వాల 38, కామారెడ్డి 42, కరీంనగర్93, ఖమ్మం 47, మహబూబ్‌నగర్33, మహబూబాబాద్24, మంచిర్యాల 28, మెదక్21, మేడ్చల్ 146, నల్లగొండ 46, నిజామాబాద్131, పెద్దపల్లి 37, సిరిసిల్ల 28, సంగారెడ్డి 111, సిద్దిపేట 27, సూర్యాపేట 35, వరంగల్‌రూరల్22, వరంగల్అర్బన్138 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.