సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 729 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఇప్పటివరకు 75,186 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. తాజాగా 1,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 395 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 35, జోగుళాంబ గద్వాల 37, ఖమ్మం 42, మహబూబ్‌నగర్32, మంచిర్యాల 45, మెదక్ 34, మేడ్చల్ మల్కాజిగిరి 105, నాగర్‌కర్నూల్22, నల్లగొండ 67, నిర్మల్29, నిజామాబాద్61, పెద్దపల్లి 43, సిరిసిల్ల 37, రంగారెడ్డి 146, సంగారెడ్డి 45, సిద్దిపేట 61, సూర్యాపేట 44, వనపర్తి 28, వరంగల్‌రూరల్32, వరంగల్ అర్బన్91 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదలచేసింది.