Breaking News

తెలంగాణలో 1,296 కేసులు

తెలంగాణలో 1,296 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 45,076 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. రికవరీ అయిన వారి సంఖ్య 30,607కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు 409 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 557 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 111, మేడ్చల్​87, సంగారెడ్డి 28, కామారెడ్డి 67, వరంగల్​ అర్బన్​117, వరంగల్ ​రూరల్​41, కరీంనగర్​27, నల్లగొండ 26, రాజన్న సిరిసిల్ల 19, నాగర్​కర్నూల్​ 13, సిద్దిపేట 10, సూర్యాపేట 16 చొప్పున మొత్తం 1,296 కేసులు పాజిటివ్​గా తేలాయి.