సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 20, కరీంనగర్24, సిరిసిల్ల 24, మేదక్16 కేసుల చొప్పున పాజిటివ్‌గా తేలాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
- July 11, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హెల్త్ బులెటిన్
- Comments Off on తెలంగాణలో 1,178 కేసులు