సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,102 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో పాజిటివ్కేసుల సంఖ్య 91,361కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 693కు చేరింది. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో 24 గంటల్లో చికిత్స అనంతరం 1,930 మంది కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా కోలుకున్నవారు 68,126 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 234 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్మల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున ఎక్కువ సంఖ్య పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
- August 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- CARONA
- COVID19 CASES
- HYDERABAD
- TELANGANA
- కరోనా పాజిటివ్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,102 కరోనా కేసులు