Breaking News

తరగతులు ఆన్​లైన్​లో.. పిల్లలు కూలీపనుల్లో

సారథిన్యూస్​, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్​ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.