సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్, డిజిటల్ లావాదేవీలు, కిసాన్ క్రెడిట్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్ కనకయ్య, గ్రామ కార్యదర్శి ఝాన్సీ, ఏటీఎంఏ చైర్మన్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, దిశ ప్రోగాం వీఎల్ఈ మామిడిపల్లి సుధాకర్, అనువోజు రవికాంత్, ఉప్పల అంజనీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- September 14, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DELHI
- DIGITAL
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- ONLINE CLASSES
- TELANGANA
- కేంద్రప్రభుత్వం
- కేసీఆర్
- తెలంగాణ
- నరేంద్రమోదీ
- హైదరాబాద్
- Comments Off on డిజిటల్ యుగం.. హుషారు కావాలె