Breaking News

‘డబుల్​’ ఇండ్లు గొప్పపథకం

సారథిన్యూస్​, రామగుండం: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్​బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని మూడో డివిజన్​లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాస్, నీలరపు రవి తదితరులు పాల్గొన్నారు.