టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించడంతో టిక్‌టాక్ యూజర్లు.. సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారు. టిక్‌టాక్ యాప్ చైనా కంపెనీ నుంచి చేతులు మారితే.. మళ్లీ మనదేశంలోకి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ ప్రియులకు యూట్యూబ్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. అచ్చం టిక్‌టాక్ లాంటి ఓ యాప్‌ను యూట్యూబ్ రూపొందించింది. ఆ యాప్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
యూట్యూబ్ షార్ట్ పేరుతో ఆ యాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నది. త్వరలోనే మరిన్ని ఫీచర్లు ఈ యాప్‌కు జతచేయనున్నారు. అచ్చం టిక్‌టాక్ లాగే పనిచేసే ఈ యాప్ ద్వారా యూజర్లు 15 సెకన్ల పాటు వీడియోను క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ను మనకిష్టమైన లోకల్ సాంగ్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇన్ ప్రొడక్ట్ మ్యూజిక్ పిక్కర్ ఫీచర్ ద్వారా మ్యూజిక్ కోసం పొందవచ్చు. ఇందులో లక్ష మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నాయి. త్వరలో ఐవోఎస్ డివైజ్ ల్లోనూ ఈ యాప్ అందుబాటులోకి రానుంది. మీరు ఈ కొత్తయాప్ టిక్‌టాక్ ప్రియుల ఆందోళనను తీరుస్తుందో లేదో వేచిచూడాలి.