బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వను టార్గెట్ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్‌లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్‌కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని గ్రూప్‌లోని మెజార్టీ సభ్యులు యోచిస్తున్నారట. ఇది గ్రహించిన గంగవ్వ టీం.. ఇంటి బయట మరింత యాక్టివ్ అయ్యింది. గత వారం కంటే ఈ వారం ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.
గంగవ్వ కోసమే బిగ్‌బాస్ చూస్తున్నారా?
గతంలో బిగ్‌బాస్ గేమ్ షో అంటేనే ఇష్టపడని చాలా మంది ఇప్పడు కేవలం గంగవ్వ కోసమే ఈ షోను చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలువురు సోషల్‌మీడియాలో బాహాటంగానే వెల్లడించారు. గంగవ్వ మీద ప్రేక్షకుల్లో ఏ రేంజ్లో అభిమానం ఉందో అర్థమవుతున్నది.
‘బిగ్‌బాస్’ టీం ఏం ఆలోచిస్తున్నది..
మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులు కేవలం గంగవ్వ కోసం ఈ షోను చూస్తున్నారు. ఒకవేళ గంగవ్వ హౌస్ నుంచి వెళ్లిపోతే బిగ్‌బాస్ రేటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా పడిపోవడం ఖాయం. దీంతో బిగ్బాస్టీం గంగవ్వ కొంతకాలం ఉండాలని కోరుకుంటోందట.