సారథిన్యూస్, రామడుగు: ఇటీవల కొంతకాలంగా కురుస్తున్న భారీవర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఈ జోరువానతో ఇప్పటికే పలుచోట్ల పాతమిద్దెలు కూలిపోయాయి. పలువురు గాయపడ్డారు. వరదతాకిడికి కొందరు గల్లంతయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. గాంకుంట్ల చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతంలో స్కూలు నిర్మాణం చేపట్టడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదు. రోజు ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, సిబ్బంది భయం భయంగా గడుపుతున్నారు.
- September 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- KTR
- RAINS
- SCHOOLS
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- కేసీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on జోరువాన.. నిండా ముంచింది