Breaking News

చివరి దశలో క్లినికల్ ట్రయల్స్

చిరరి దశకు కరోనా ట్రయల్స్​

సారథి న్యూస్​, హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య బృందం. నిన్న 11 మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ నిమ్స్ వైద్య బృందం ఇచ్చింది. నేడు మరో పది మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు నిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. దేశంలోని మొత్తం 12 ప్రాంతాల్లో క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.