సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని సూచించారు. ప్రతి మిల్లు వద్ద వీఆర్వో స్థాయి సిట్టింగ్ ఆఫీసర్ పర్యవేక్షణ ఉండాలన్నారు. రైతులు ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా ఆరబెట్టుకుని రావాలని సూచించారు. ప్రతి క్లస్టర్ పరిధిలోని మూడు, నాలుగు కేంద్రాలకు ఒక మండల స్థాయి ఆఫీసర్‌ను నియమించినట్లు వివరించారు. ఆయన వెంట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, నిజాంపేట పీఏసీఎస్ సెక్రటరీ శోభరాణి, ఏఈవోలు ఉన్నారు.
- November 3, 2020
- Archive
- Top News
- మెదక్
- medak
- NIZAMPET
- RAMAYAMPET
- RYTHUVEDIKA
- డీఏవో
- నిజాంపేట
- మెదక్
- రామాయంపేట
- రైతువేదిక
- వ్యవసాయశాఖ
- Comments Off on చివరి గింజ దాకా కొంటాం