Breaking News

చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.