సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే పాలించిందన్నారు. జూబ్లీహిల్స్ కమలానగర్లో 210 ఇండ్లు, సారథినగర్లో 160 ఇళ్లు కడుతున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ నేతల సర్టిఫికెట్అవసరం లేదన్నారు.
- September 22, 2020
- Archive
- Top News
- పొలిటికల్
- CONGRESS
- GHMC
- GREATER
- HYDERABAD
- కాంగ్రెస్
- గ్రేటర్
- జీహెచ్ఎంసీ
- హైదరాబాద్
- Comments Off on గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్ డ్రామాలు