బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్రిపోర్ట్స్ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్ చేసిందంటే ఆమె హౌస్‌లో ఎంత అసౌకర్యంగా గడిపిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తనకు ఇల్లు కట్టించాలంటూ హౌస్‌లో ఉన్నప్పుడు గంగవ్వ బిగ్‌బాస్‌ను కోరింది. దీంతో ఇల్లు కట్టిస్తానని నాగార్జున హామీ ఇచ్చాడు. ‘నీకు ఇల్లు కావాలని అన్నావు కదా. నేను కట్టిస్తా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్లు. నీ ఇంటి పని మొదలవుతుంది.. అందుకు నేను హామీ ఇస్తున్నా’ అంటూ నాగ్ మాటిచ్చాడు.
- October 11, 2020
- Archive
- Top News
- సినిమా
- BIGGBOSS
- GANGAVVA
- HOUSE
- HYDERABAD
- NAGARJUNA
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- గంగవ్వ
- తెలంగాణ
- నాగార్జున
- బిగ్‌బాస్
- హైదరాబాద్
- Comments Off on గంగవ్వా.. ఫికర్ జెయ్యకు నేను ఇల్లు కట్టిస్తా!