Breaking News

కోరలు చాచిన కరోనా మహమ్మారి

కోరలు చాచిన కరోనా మహమ్మారి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాచింది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ.. ఈజీగా మింగేస్తోంది. ఆదివారం కొత్తగా 983 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,418కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా నలుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 247 మంది చనిపోయారు. యాక్టివ్​కేసులు 9 వేలు ఉన్నాయి. చికిత్స అనంతరం 5172 మంది డిశ్చార్జ్​ అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.