సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యారు. మహమ్మారి బారినపడి నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 191 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,406కి చేరింది. 3,027 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రసుత్తం 2,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్ 13, కరీంనగర్ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు గ్రేటర్ పరిధిలో 1600 కరోనా శాంపిల్స్ తీసుకున్నారు. శేరిలింగంపల్లి జోన్ నుంచి 210, కూకట్ పల్లి జోన్ నుంచి 45, ఎల్బీ నగర్ జోన్ నుంచి 240, సికింద్రాబాద్ జోన్ నుంచి 151, ఖైరతాబాద్ జోన్ నుంచి 575, చార్మినార్ జోన్ పరిధి నుంచి 379 శాంపిల్స్ తీసుకున్నారు.
- June 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CAROONA
- TELANGANA
- జీహెచ్‌ఎంసీ
- పాజిటివ్ కేసులు
- హైదరాబాద్
- Comments Off on కేసులు 200 పైనే..