Breaking News

కేసీఆర్​ లాంటి సీఎం.. నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్!

సారథిన్యూస్ రామగుండం: ‘ప్రపంచం మొత్తం గాలించి చూసినా కేసీఆర్​ లాంటి రాజకీయనేత మనకు కనిపించరు. ఆయన పనితీరు నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్! అన్నట్టుగా కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన పల్లి వద్ద జిల్లా గొర్రెల, మేకల మార్కెట్ కు భూమి పూజ చేశారు. అనంతరం గోదావరిఖనిలోని సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో రెండు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎంపీపీ, అనసూర్య, రాంరెడ్డి, దుర్గం విజయం, జడ్పీటీసీలు అమ్ముల నారాయణ, కందుల సంధ్యారాణి, నగర మేయర్ అనిల్ కుమార్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , టిఆర్ఎస్ నాయకులు పాత పల్లి ఎల్లయ్య, అచ్చ వేణు, నారాయణ దాస్ మారుతి, తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజు, ఫేస్ కంప్యూటర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.