Breaking News

కేటీఆర్​కు బర్త్​డే విషెస్​

కేటీఆర్​కు బర్త్​డే విషెస్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో పలువురు ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మహబూబ్​నగర్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.