సారథి న్యూస్, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు రెడ్ జోన్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో పాటు ప్రోత్సాహకంగా రూ.8వేలు చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక జ్యోతిభవన్ లో ఎన్టీపీసీ ఈడీ రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగా ఎన్టీపీసీ నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఎన్వీ రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి ఉన్నారు.