న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టులు భౌతికంగా ప్రారంభమయ్యాక విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. 1984 నవంబర్ 1 న ఢిల్లీలోని గురుద్వార వద్ద జరిగిన అల్లర్లలో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురి హత్యకు సంబంధించి సజ్జన్ కుమార్ హస్తమున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.
- September 4, 2020
- Archive
- Top News
- జాతీయం
- CONGRESS
- COURT
- DELHI
- INDIRA
- JAIL
- PANJAB
- PUNISHMENT
- RAHUL
- ఇందిరాగాంధీ
- ఊచకోత
- కాంగ్రెస్
- రాహుల్ గాంధీ
- సిక్కులు
- సోనియాగాంధీ
- Comments Off on కాంగ్రెస్ నేతకు జీవితఖైదు