సారథిన్యూస్, నిజామాబాద్: ఇందూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి.
బీజేపీకి 56, కాంగ్రెస్కు 29 ఓట్లు రాగా.. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని కవిత ఇంట్లో, ప్రగతిభవన్లో, తెలంగాణ భవన్లో సందడి వాతావరణం నెలకొన్నది.
- October 12, 2020
- Archive
- Top News
- నిజామాబాద్
- MLC
- కవిత
- కేటీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కవిత ఘనవిజయం.. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతు