సారథి న్యూస్, హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. షేక్‌పేట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని ప్రభుత్వం సూచించింది. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్‌లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కల్నల్ కుటుంబానికి కేటాయించిన స్థలాల్ని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు.
- July 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BANJARAHILLS
- COLLECTOR
- LAND
- SANTOSH
- జగదీశ్ రెడ్డి
- బంజారాహిల్స్
- Comments Off on కల్నల్ కుటుంబానికి బంజారాహిల్స్‌లో స్థలం