సారథిన్యూస్, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్హెచ్వో డాక్టర్ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్‌నాయక్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎమ్‌హెచ్‌వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్ వచ్చన రిపోర్టులను శంకర్‌నాయక్ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్‌హెచ్‌వో పనితీరు సక్రమంగా లేదని ఆమె పనితీరు వల్ల కరోనా బాధితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. తప్పుడు సమాచారం చేరవేస్తూన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
- June 28, 2020
- Archive
- తెలంగాణ
- CARONA
- COLLECTOR
- DMHO
- DOCTOR
- KAMMAM
- కరోనా
- శంకర్‌నాయక్
- Comments Off on కరోనా వచ్చిందంటూ దుష్ప్రచారం