సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్త ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం మొదటిసారి కొత్తగా 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో కేసులు 7072కు చేరాయి. ఇప్పటివరకు 53,757 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 3,363 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 50 కేసులు, కరీంనగర్ జిల్లాలో 13కేసులు నమోదయ్యాయి.
- June 20, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CAROONA
- GHMC
- కరోనా
- జీహెచ్ఎంసీ
- తెలంగాణ
- Comments Off on కరోనా రికార్డు