విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడ్డారు. కంగనా తనను తాను అతిగా ఊహించుకుంటుందని విమర్శించారు. కంగనా రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించినంత మాత్రాన ఆమె నిజంగా లక్ష్మీబాయిలా ఫీలయిపోతుందని పేర్కొన్నారు. ఆమె లక్ష్మీబాయి అయితే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోక చక్రవర్తిగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన అమీర్‌ఖాన్, మోదీగా నటించిన వివేక్ ఒబేరాయ్ ఇంకేలా ఫీల్ కావాలి అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. కాగా ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌కు నెట్‌జన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు ఆయనకు సపోర్ట్‌గా ట్వీట్లు పెడుతుంటే. మరికొందరు అనవసర విషయాలు మీకెందుకు అంటూ ప్రకాశ్‌రాజ్‌పై రివర్స్ కామెంట్ పెడుతున్నారు.
- September 12, 2020
- Archive
- సినిమా
- CHENNAI
- HYDERABAD
- KANGANA
- MUMBAI
- PRAKASHRAJ
- SOCIAL MEDIA
- TWEET
- చెన్నై
- ట్వీట్
- ప్రకాశ్‌రాజ్
- ముంబై
- హైదరాబాద్
- Comments Off on కంగనా కొంచెం తగ్గించుకో