సారథి న్యూస్, హైదరాబాద్: విజయాలకు పొంగిపోయేది లేదని, అపజయాలకు కుంగిపోవమని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కె.తారక రామారావు అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఇదే చెబుతున్నామని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తాము ఆశించిన ఫలితం రాలేదు.. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. మా నాయకులకు ఒక హెచ్చరిక లాంటిది. మేము అప్రమత్తం కావడానికి ఈ ఎన్నికలు తోడ్పడతాయి. ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గెలుపు మావైపే నిలిచింది. ఓటమితో కుంగిపోకుండా సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాం. సమావేశంలో మంత్రులు తలపాని శ్రీనివాస్‌యాదవ్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
- November 10, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- HARISHRAO
- HYDERABAD
- KTR
- TELANGANA
- తెలంగాణ
- దుబ్బాక ఎన్నిక
- మంత్రి కేటీఆర్
- సీఎం కేసీఆర్
- హరీశ్‌రావు
- Comments Off on ఓటమికి కుంగిపోం: మంత్రి కేటీఆర్