Breaking News

ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ఏపీలో విజృంభిస్తున్న కరోనా

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒకే రోజు 657 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినుంచి 39, ఇతర దేశాల నుంచి ఏడుగురికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఇప్పటి వరకు 15,252 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 8,071 ఉన్నాయి. ఇప్పటివరకు 6,988 మంది వ్యాధి బారినపడి డిశ్చార్జ్​అయ్యారు. ఇప్పటి వరకు 193 మంది చనిపోయారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే .. అనంతపురం జిల్లాలో 118, చిత్తూరు 35, తూర్పు గోదావరి 80, గుంటూరు 77, కడప 60, కృష్ణా 52, కర్నూలు 90, నెల్లూరు 33, ప్రకాశం 28, విశాఖపట్నం 21, విజయనగరం రెండు, వెస్ట్‌ గోదావరి జిల్లాలో 15, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా 39, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఏడు కేసులు నమోదయ్యాయి.