సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు భూ సమస్యలకు సంబంధించినవి, మిగతాది అత్యాచారాలు, సర్వీస్ మేటర్స్, మిగతావి ఇతర కేసులు ఉన్నాయని తెలిపారు. జన అదాలత్ లో 10 కేసులకు గాను ఐదుకేసులు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతినెలా 30న పౌరహక్కుల దినోత్సవం జరపాలని, అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆయన కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రామ్ లాల్ నాయక్, విద్యాసాగర్, నీలాదేవి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్సీ,ఎస్టీ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
- December 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ERROLLA SRINIVAS
- medak
- SANGAREDDY
- SCSTCOMMISSION
- ఎర్రోళ్ల శ్రీనివాస్
- ఎస్టీ కేసులు
- ఎస్సీ
- ఎస్సీ కమిషన్
- మెదక్
- సంగారెడ్డి
- సిద్దిపేట
- Comments Off on ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్లో పెట్టొద్దు