Breaking News

ఎన్నికలు వాయిదా వేయలేం!

న్యూఢిల్లీ: బీహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్​ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్​ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్​లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్​ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ​అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున కోర్టు జోక్యం చేసుకొని బీహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించాలని పిటిషనర్​ అవినాశ్​ రాకూర్​ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. కాగా అతడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది.