Breaking News

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్​ఎస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్​ఎస్​ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా నిజాంపేటలో టీఆర్​ఎస్​ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.