ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్‌ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే తిట్టేసుకోవడం.. అప్పుడే పొగిడేసుకోవడం ఈ స్ర్టాటజీని ఏమనాలి? అది మెగా బ్రదర్ నాగబాబుకే తెలియాలంటున్నారు ఇది అర్థం కాని వాళ్లు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా బ్రదర్ నాగబాబు హీరో నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్సెస్ జనసేన ఎపిసోడ్స్ అని అందరికీ తెలుసు. యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూల్లో బాలయ్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. కానీ వాటికి బాలయ్య బాబు స్పందించలేదు. ఇప్పుడు దానికి కాంట్రాస్టుగా .. బాలకృష్ణ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసి నాగబాబు మరో షాకిచ్చారు. ఆసక్తికరంగా ఇది పవన్ కల్యాణ్ బాలయ్యను కలిసినప్పటి ఫొటో. అది కూడా పవన్ తొలిసారి కలిశారట. మూడు వేర్వేరు ఫొటోలను నాగబాబు షేర్ చేయడమే కాదు.. ఇలాంటివి తన వద్ద చాలా ఉన్నాయంటున్నారు. దీనిగురించి సోషల్ మీడియాలో అయితే పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా, ఫ్యానిజం పరంగా ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? అన్న చర్చ సాగుతోంది.