సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్‌రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చారు. ఆ రుణపరిమితిని ఏడున్నర లక్షల వరకు పెంచుతానని జగన్ పాదయాత్రలో చెప్పి.. ఇప్పడు మహిళలను మోసగిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక గ్రూప్ మొత్తానికి ఇచ్చే సొమ్మును రూ.3 లక్షలకే పరిమితం చేశారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి చంద్రబాబుపై నిందలేయడం ద్వారా తన చావు తెలివితేటలు చూపిస్తున్నారు. బీజేపీకి భయపడే ప్రభుత్వం అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించింది’ అని అనిత వ్యాఖ్యానించారు.
- September 15, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- పొలిటికల్
- AMARAVATHI
- ANDHRAPRADESH
- ANITHA
- AP
- APCM JAGAN
- CHANDRABABU
- TDP
- అనిత
- అమరావతి
- ఏపీసీఎం
- జగన్
- Comments Off on ‘ఆసరా’ కాదు టోకరా!