సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథితో పాటు పార్టీ నాయకులు ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనంతో చర్చి భవనాలు నిర్మిస్తామని వైఎస్సార్సీపీ, టీడీపీలు మ్యానిఫెస్టోలో ప్రకటించాయని, హిందువులు సమర్పించే నిధులతో ఒక్క ఆలయమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సందడి సుధాకర్, కాళింగి నరసింహవర్మ, రంగస్వామి, సాయిప్రదీప్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఆధ్వర్యంలో..
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని జనసేన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జివ్వాజి రేఖ ఆరోపించారు. అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథం దగ్ధం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి వ్లెంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు సోమువీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. గురువారం జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జివ్వాజి రేఖ కర్నూలులోని తన స్వగృహంలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. హిందూ దేవాలయాల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, అంతర్వేది ఘటన దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పవన్ కుమార్, జనసైనికులు రేష్మ, శివ, పరశురాం, ఫయాజ్, మౌలాలి, చిన్న, చిరు, కార్తీక్ పాల్గొన్నారు.