సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘పవర్‌స్టార్’ అంటూ ఓ సినిమాను ప్రకటించడంతోపాటు దాని ట్రైలర్‌ను విడుదల చేశాడు. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ట్రైలర్ విడుదల కాగానే రెచ్చిపోయారు. ఆర్జీవీ ‘పవర్‌స్టార్’కు కౌంటర్‌గా ‘పరాన్నజీవి’ అనే సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అనంతరం చిత్రంలో ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ఓ పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గురువారం ఏకంగా హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయంపై ఓయూ జేఏసీ పేరిట దాడి జరిగింది. ఈ దాడి చేసింది పవన్‌కల్యాణ్ అభిమానులేనని అందరూ చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో ఇటు సోషల్‌మీడియాలో.. అటు టీవీ చానళ్లలో ఇదే అంశంపై చర్చ కొనసాగింది. రెండ్రోజులపాటు జనాలు కరోనా కేసులు కూడా మరిచిపోయి.. ఇదే విషయంపై చర్చించుకున్నారు. తన స్టూడియోపై కొందరు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ కొద్దిసేపటికే వెనక్కి తగ్గి కంప్లైట్‌ను విత్‌డ్రా చేసుకున్నారు కూడా. దీంతో ‘తోకముడిచిన ఆర్జీవీ’ అంటూ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కానీ ఆర్జీవీ మాత్రం తన ట్రైలర్‌కు ఎన్ని వ్యూస్ పెరిగాయో చూసుకుంటూ రిలాక్స్ అయ్యాడు. మొత్తానికి ఈ వ్యవహారంలో లాభం పొందింది మాత్రం ఆర్జీవీనే.. రెండ్రోజులపాటు పబ్లిక్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు. తన ట్రైలర్‌కు వ్యూస్ పెంచుకున్నాడు. తన మూవికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. తన బిజినెస్ పెంచుకున్నాడని చర్చించుకుంటున్నారు సినీ విశ్లేషకులు.
- July 24, 2020
- Archive
- Top News
- సినిమా
- ATTACK
- FANS
- HYDERABAD
- POWERSTAR
- RGV
- పవర్‌స్టార్
- రాంగోపాల్‌వర్మ
- Comments Off on ఆర్జీవీ x పవన్‌ఫ్యాన్స్.. లాభం ఎవరికి?