Breaking News

అల్లూ అర్జున్​పై కేసు!


అనుమతులు లేకుండా సినిమా షూటింగ్​ చేస్తుండటంతో తెలుగు సినీహీరో అల్లూ అర్జున్​పై ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పీఎస్​లో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్​ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అల్లూ అర్జున్​, పుష్ప చిత్ర యూనిట్​ కుంటాల జలపాతాన్ని సందర్శించడమే కాక అక్కడికి సమీపంలోని తిప్పేశ్వర్​ అటవీప్రాంతంలో షూటింగ్​ చేశారు. దీంతో సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్​, పుష్ప సినిమా యూనిట్​ కోవిడ్​ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్​ రాజు మాట్లాడుతూ.. సామాన్యులకే తప్ప సినిమా వాళ్లకు నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.