Breaking News

అక్మల్ పై మూడేళ్ల నిషేధం

అక్మల్ పై మూడేళ్ల నిషేధం

లాహోర్: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్‌ పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల బ్యాన్‌ విధించింది. పీఎస్‌ఎల్‌ ఆరంభానికి ముందు మ్యాచ్‌ ఫిక్సర్లు తనను కలిసిన విషయాన్ని వెల్లడించనందుకు అతనిపై ఈ మేరకు చర్యలు తీసుకుంది.

ఈ నిషేధం ఫిబ్రవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని పీసీబీ వెల్లడించింది. ఫిక్సర్లు కలిసిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకురావాలన్న అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు పీసీబీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్యలకు ఉపక్రమించింది.

2009లో తన ఫస్ట్‌ టెస్ట్ లోనే సెంచరీతో కెరీర్‌‌ను ఘనంగా ఆరంభించిన ఉమర్‌‌ ఆ తర్వాత అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. క్రమశిక్షణ చర్యలు, బ్యాన్స్, ఫైన్స్‌ ఎదుర్కొన్నాడు.

ట్రాఫిక్ సిగ్నల్‌ జంప్‌ చేసి పోలీసులతో ఘర్షణ పడిన కారణంగా 2014లో అతను అరెస్ట్ అయ్యాడు. చివరగా గతేడాది శ్రీలంకతో రెండు టీ20ల్లో ఆడిన అక్మల్‌.. రెండుసార్లూ డకౌట్ అయ్యాడు. పాక్‌ తరఫున ఇప్పటిదాకా అతను 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.