Breaking News

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం
  • పేదలకు న్యాయం చేద్దాం
  • ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్​ చేయండి
  • వీడియోకాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై మాట్లాడారు. ఇళ్లపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. మంచి ఆలోచనతో పనిచేస్తున్నామని ఎ్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

30 లక్ష మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నామని, అందుకోసం 62వేల ఎకరాలను సేకరించామన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ వాయిదాపడిన నేపథ్యంలో లే అవుట్లలో మొక్కను నాటించి పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ఫ్లాట్‌ నంబర్‌, హద్దు పేర్కొనడం వంటి పనులు చేయాలని సూచించారు. ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ, వార్డు సచివాయాల్లో డిస్‌ప్లే చేయన్నారు. ఇంకా ఎవరైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోతే దరఖాస్తు చేస్తే, ఎంక్వైరీ చేసిన తర్వాత 90 రోజుల్లోనే పట్టా వారికి ఇవ్వాన్నారు. నాడు నేడు పనులపై ధ్యాసపెట్టాలని సీఎం జగన్​సూచించారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉండకూడదన్నారు.
కలెక్టర్లు, వైద్యాధికారులకు అభినందన
ఇప్పటివరకూ 10లక్షలకు పైగా కరోనా టెస్టులు చేయగలిగామని వైద్యాధికారులు, కలెక్టర్లను సీఎం జగన్​ అభినందించారు. హోం ఐసోలేషన్‌ పై కలెక్టర్లు దృష్టిపెట్టాన్నారు. ప్రత్యేక గది లేని వారికోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పెట్టామన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కిరప్ప, జేసీ రవి పట్టన్‌ షెట్టి, జేసీ(అభివృద్ధి) రామసుందర్‌ రెడ్డి, జేసీ(సంక్షేమం) సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధిమీనా పాల్గొన్నారు.