సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్మెడ్లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్‌నగర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికొస్తున్న ఓ వ్యక్తి సరూర్‌నగర్ చెరువులో కొట్టుకుపోయాడు. అతడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్(45) నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని సరూర్‌నగర్ నుంచి తపోవన్ కాలనీ వైపు స్కూటీపై వెళ్తుండగా రోడ్డు పై బైక్ వరద నీటిలో బైక్ కూరుకుపోయింది. ఈ క్రమంలో బైక్ ను నెడుతుండగా.. ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన జరిగి 12 గంటలు గడుస్తున్నా నవీన్ ఆచూకీ తెలియలేదు. డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నవీన్ జాడ కోసం వెతుకుతున్నాయి.