Breaking News

వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

సారథి న్యూస్, పాలకొండ(శ్రీకాకుళం): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెరుకు రైతుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇది రైతన్నల ప్రభుత్వమని, విద్య, వైద్యం, వ్యయసాయం, సంక్షేమాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం పెంచాలన్నారు. తద్వారా చెరుకు ఫ్యాక్టరీ మనుగడకు అవకాశం ఉంటుందన్నారు. ఈసారి కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో పంటవేసి మంచి దిగుబడి సాధిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరాయ కళావతి, కంబాల జోగులు, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, పాలకొండ ఆర్డీవో కుమార్, వ్యవసాయ మిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గొండు రఘురాం, సంకిలి షుగర్స్ యాజమాన్య ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు.