సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రా నుంచి మద్యం సరఫరా పూర్తిస్థాయిలో కట్టడి చేయాన్న క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను తీసుకొచ్చిందని సెబ్ ఏఎస్పీ గౌతమిసాలి తెలిపారు. శనివారం సెబ్, ఎక్సైజ్, స్పెషల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక, నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సెబ్, ఏఎస్పీ గౌతమి సాలీ పర్యవేక్షణలో జరిగిన దాడిలో నాటుసారా తయారీదారులు, విక్రేతలను 11 మందిని అరెస్ట్ చేశారు. రెండు వెహికిల్స్ సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 249 మద్యం సీసాలు, 21 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 3200 లీటర్ల నాటు సారాబెల్లం ఊటను ధ్వంసం చేశారు.
- June 28, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- క్రైమ్
- Kurnool
- SEB
- కర్నూలు
- సెబ్
- Comments Off on సెబ్ ఆధ్వర్యంలో విస్తృత దాడులు