దుబాయ్: ఐపీఎల్13 సీరిస్‌లో భాగంగా 30వ మ్యాచ్.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధవన్ (57, 33 బంతుల్లో 6×4, 6×2), శ్రేయాస్ అయ్యర్(53, 43 బంతుల్లో 4×3, 6×2) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఉనాద్కత్ రెండు, త్యాగి, శ్రేయాస్ గోపాల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు బెన్ స్టోక్స్(41,35 బంతుల్లో 6×4), జేసీ బట్లర్(22, 9 బంతుల్లో 3×4, 6×1) మంచి శుభారంభం అందించారు. ఎస్వీ శాంసన్(25,18 బంతుల్లో 6×2), ఉతప్ప (32, 27 బంతుల్లో 4×3, 6×1) తేవాతియా 14 పరుగులు చేశారు. మిగతా వారు ఎవరూ కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగుల వద్ద అలౌట్అయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో దేశ్‌పాండే, నార్త్జే రెండు వికెట్ల చొప్పున, రబడ, అశ్విన్, పటేల్ ఒక్కో వికెట్చొప్పున తీశారు. ప్లేయర్ఆఫ్ది మ్యాచ్ అవార్డు అన్రిచ్నార్త్జేకు దక్కింది. టాటా అల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌కు దక్కింది.