సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి శిద్ధాతో పాటు ఆయన కుమారుడు సుధీర్‌కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా శిద్ధా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
- June 10, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- ప్రకాశం
- Jagan
- SIDDA RAGAVARAO
- TAGS: APCM
- టీడీపీ
- Comments Off on వైఎస్సార్ సీపీలోకి శిద్ధ రాఘవరావు