Breaking News

వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్​’ కట్​

వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్’ కట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా వేగవంతంగా కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు రికార్డులు అప్పగించాలని, ఈ మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని సూచించింది. సోమవారం సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని కోరిన సీఎస్ సోమేశ్​కుమార్ కోరారు. అయితే రెవెన్యూశాఖలో సమూల మార్పులపై కొన్నాళ్లుగా పలు సభలు, అసెంబ్లీలో తరచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ‘‘ల్యాండ్ మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్’ను తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సంబంధిత బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

నాగర్​కర్నూల్​ జిల్లా వీపనగండ్ల మండల తహసీల్దార్ ఆఫీసులో అన్ని గ్రామాల రెవెన్యూ రికార్డుల స్వాధీన ప్రక్రియ