సారథి న్యూస్, కర్నూలు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్19 నిబంధనలను అనుసరించి జిల్లా ప్రజలంతా ప్రకృతిని, సంస్కృతిని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ మట్టి గణపతులను ఇంట్లోనే పెట్టుకుని సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సామూహిక వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ స్పష్టంచేశారు. విఘ్నాలను తొలగించి, నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలని, సకల శుభాలను, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను కలగజేయాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరారు.
- August 22, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- BUGGANA
- CAROONA
- Kurnool
- VINAYAKACHAVITHI
- కరోనా
- కర్నూలు
- బుగ్గన
- వినాయక చవితి
- Comments Off on వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండి