సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- July 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BOOKS
- KARIMNAGAR
- MLA
- STUDENTS
- ఎమ్మెల్యే
- తెలంగాణ
- Comments Off on విద్యార్థులే తెలంగాణ సంపద