సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
- June 29, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- AP CM
- Jagan
- YSR
- రైతు దినోత్సవం
- వైఎస్సార్
- Comments Off on రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి