సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్‌జన్లు ఆమెపై ట్రోలింగ్ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ నటి, మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి, స్వర భాస్కర్, తాప్సి రియాకు సపోర్ట్‌గా మాట్లాడారు. ‘ఆమె దోషి అయితే సీబీఐ విచారణలో తేలుతుంది. కానీ ఆ లోపే మీడియా ఎందుకు ఆమెపై పగబట్టింది’ అంటూ లక్ష్మి వ్యాఖ్యానించారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ రియాకు అండగా నిలించారు. ‘రియాకు మద్దతు తెలిపినందుకు మంచు లక్ష్మికి ధన్యవాదాలు. సుశాంత్ మరణం అత్యంత విషాదరకం కానీ ఈ ఘటన మీడియాసర్కస్గా
మారడం బాధాకరం. ఒక మహిళ పట్ల నేరం రుజువు కాకమునుపే మీడియా ఎందుకు ఇంతలా దుష్ప్రచారం చేస్తుందో అర్థం కావడం లేదు. ఒక దేశ పౌరురాలిగా రాజ్యాంగం ఆమెకు కల్పించిన హక్కులను కూడా మీడియా కాలరాస్తోంది. దయచేసి ఆమెను వదిలిపెట్టండి’ అంటూ విద్యాబాలన్ వ్యాఖ్యానించింది.
- September 2, 2020
- Archive
- Top News
- జాతీయం
- సినిమా
- ACTRESS
- BOLLYWOOD
- MANCHU LAKSHMI
- MEDIA
- RIA
- SUSHANTH
- TOLLYWOOD
- మృతి
- రియా చక్రవర్తి
- సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్
- Comments Off on రియాకు పెరుగుతున్న మద్దతు